Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీస్‌ పహారాలో రైల్వే పనులు

మద్దికెర, డిసెంబరు 4: మద్దికెర రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పోలీసు బందోబస్తు మధ్య శనివారం పునఃప్రారంభమ య్యాయి. కాంట్రాక్టు కంపెనీ మేనేజర్‌ నందకిశోర్‌ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. రైల్వే కాంట్రాక్టర్‌ పర్సంటేజీ ఇవ్వలేదని వైసీపీ వర్గీయులు కొందరు ఈ నెల 1వ తేదీన పని చేసే వారిపై దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పని ప్రదేశంలో రక్షణ కల్పించారు. రైల్వే పనులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని రైల్వే ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. 

Advertisement
Advertisement