రైలు టిక్కెట్‌పై H1 అని రాసి ఉంటే, ఎక్కడ కూర్చోవాలో తెలుసా?

ABN , First Publish Date - 2022-05-11T16:37:35+05:30 IST

భారతీయ రైల్వేలలో అనేక రైల్వే కోడ్‌లు ఉంటాయి...

రైలు టిక్కెట్‌పై H1 అని రాసి ఉంటే, ఎక్కడ కూర్చోవాలో తెలుసా?

భారతీయ రైల్వేలలో అనేక రైల్వే కోడ్‌లు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం అందరికీ అవసరం. రైల్వే టిక్కెట్‌పై చాలా కోడ్‌లు కనిపిస్తాయి. ఇవి ప్రయాణం గురించిన సమాచారాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకు SL అనేది స్లీపర్ క్లాస్ కోచ్‌కు సంకేతం. B1 మొదలైనవి థర్డ్ AC కోచ్ కోసం ఉపయోగిస్తారు. అదేవిధంగా చాలా టిక్కెట్లపై H1 అని కూడా రాసివుంటుంది. దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని AC ఫస్ట్ క్లాస్ కోసం ఉపయోగిస్తారు. 


థర్డ్ ఏసీకి B వాడినట్లే, చైర్ కార్‌కి CC ఉపయోగిస్తారు. అలాగే ఫస్ట్ ఏసీకి H ఉపయోగిస్తారు. మొదటి ACలో క్యూబ్స్ లేదా క్యాబిన్‌లు ఉంటాయి. అందులో 2 లేదా నాలుగు సీట్ల క్యాబిన్‌లు ఉంటాయి. మీరు రెండు టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లయితే, మీకు క్యాబిన్ కేటాయిస్తారు. దీనిలో A, B, C, D ఆధారంగా సీటు స్థిరంగా ఉంటుంది. ఫస్ట్ ఏసీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. అందులో ఒక వైపు సీటు ఉండదు. ఇందులో వివిధ క్యాబిన్‌లు కనిపిస్తాయి. ఈ క్యాబిన్‌లకు స్లైడింగ్ డోర్ ఉంటుంది. ఒక క్యాబిన్‌లో 2 సీట్లు ఉంటాయి. కొన్ని నాలుగు సీట్ల క్యాబిన్‌లు కూడా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ACలో క్యాబిన్‌ను గదిగా ఉపయోగించవచ్చు. దాని గేట్‌ను లోపలి నుండి కూడా మూసివేయవచ్చు. 

Read more