ప్రారంభానికి సిద్ధమైన వెలికల్లు రైల్వేస్టేషన్‌

ABN , First Publish Date - 2022-06-24T06:21:26+05:30 IST

మండల పరిధిలోని కలుజుగుంట గ్రామ అడవుల్లో వెల్లికల్లు పేరుతో నిర్మించిన రైల్వేస్టేషన్‌ పూర్తయి

ప్రారంభానికి సిద్ధమైన వెలికల్లు రైల్వేస్టేషన్‌

రాపూరు, జూన్‌ 23: మండల పరిధిలోని కలుజుగుంట గ్రామ అడవుల్లో వెల్లికల్లు పేరుతో నిర్మించిన రైల్వేస్టేషన్‌ పూర్తయి ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. కృష్ణపట్నం-ఓబులువారిపల్లి రైల్వే లైన్‌లో భాగంగా వెలికల్లు రైల్వేస్టేషన్‌ నిర్మించాల్సి ఉంది. నాలుగేళ్ల కిందటే రైల్వే లైన్‌ ప్రారంభించినా ఈ స్టేషన్‌ నిర్మాణాన్ని చేపట్టలేదు. రైల్వే అధికారులు విడుదల చేసిన మ్యాప్‌లో కూడా వెలికల్లు పేరుతో రైల్వేస్టేషన్‌ ఉంది. అయితే స్టేషన్‌ నిర్మాణాన్ని చేపట్టకపోవడంతో  విస్మయానికి లోనయ్యారు. అయితే రెండేళ్ల కిందట స్టేషన్‌ నిర్మాణ పనులు ప్రారంభించి ఇటీవ లే భవన నిర్మాణం పూర్తిచేశారు. స్టేషన్‌లో సామగ్రిని అమర్చి స్టేషన్‌ వద్ద మూడులైన్లు నిర్మా ణం చేపట్టి విద్యుత్తు సౌకర్యం కల్పించారు. స్టేషన్‌లో సిగ్నలింగ్‌ వ్యవస్థతోపాటు అన్ని పనులు పూర్తిచేసినట్లు సమాచారం. ఈ నెలలోనే రైల్వేస్టేషన్‌ ప్రారంభిస్తారన్న ప్రచారం సాగుతోంది.  వెలికల్లు పేరుతో స్టేషన్‌ నిర్మించినా డక్కిలి వాసులకు సుమారు 5 కిలోమీటర్లు, రాపూరు వాసులకు 6 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో రైల్వేస్టేషన్‌ ఉంది. అక్కడకు వెళ్లేందుకు  సరైన దారులు లేవు.

Updated Date - 2022-06-24T06:21:26+05:30 IST