Abn logo
Sep 25 2021 @ 00:26AM

సామర్లకోట రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ఏడీఆర్‌ఎం

రైల్వేస్టేషన్‌లోని ప్రత్యేక ట్రాలీలో ట్రాక్‌ పరిశీలిస్తున్న ఏడీఆర్‌ఎం శ్రీనివాస్‌

సామర్లకోట, సెప్టెంబరు 24: సామర్లకోట రైల్వేస్టేషన్‌ను విజయవాడ ఏడీఆర్‌ఎం శ్రీనివాస్‌ శుక్రవారం సందర్శించారు. ప్లాట్‌ఫామ్‌-1లో పలు విభాగాలను పరిశీలించారు. ప్రత్యేక ట్రాలీలో అధికారులతో కలిసి దక్షిణ రైల్వే గేట్‌ సమీపాన 7వ నెంబరు పాయింట్‌ను పరిశీలించారు. రైతుల వినతిపత్రం స్వీకరించారు. 2వ ప్లాట్‌ఫామ్‌లో నిర్మాణంలో ఉన్న ఆర్పీఎఫ్‌ అవుట్‌ పోస్టు భవన పనులను పరిశీలించారు. రైల్వే సిబ్బంది కార్టర్స్‌ వాస్తవ పరిస్థితిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.