రైల్ టెల్ ఐపీవో... 26 న షేర్ల జాబితా

ABN , First Publish Date - 2021-02-23T22:36:19+05:30 IST

రైల్ టెల్ ఐపీవో 42.39 శాతం, రిటైల్ కేటగిరీలో 16.78 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి. క్యూఐబీలో 65.14 శాతం, ఎన్ఐై కేటగిరీలో 73.25 శాతం నమోదయ్యాయి. రైల్ టెల్ కార్పొరేషన్ ఐపీవో షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఈ నెల(ఫిబ్రవరి) 26వ తేదీన లిస్టయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రైల్ టెల్ ఐపీవో... 26 న షేర్ల జాబితా

ముంబై: రైల్ టెల్ ఐపీవో 42.39 శాతం,  రిటైల్ కేటగిరీలో 16.78 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి. క్యూఐబీలో 65.14 శాతం, ఎన్ఐై కేటగిరీలో 73.25 శాతం నమోదయ్యాయి. రైల్ టెల్ కార్పొరేషన్ ఐపీవో షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఈ నెల(ఫిబ్రవరి) 26వ తేదీన లిస్టయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రైల్ టెల్ ఐపీవోలో వాటా కేటాయింపు బ్రోక‌రేజెస్ మేరకు ఈ రోజు ఖ‌రార‌య్యే అవకాశముంది.


రైల్ టెల్ ఐపీఓకు ధ‌ర‌ఖాస్తుదారుల కేటాయింపు స్థితిని కెఫిన్ టెక్నాల‌జీస్ వెబ్‌సైట్‌లో చెక్ చేయ‌వ‌చ్చు. ఇది... షేర్ల వాటా కేటాయింపుల‌ను, రీఫండ్స్‌ను నిర్వ‌హిస్తుంది. ఈ వివ‌రాలు బీఎస్ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. షేర్ల జాబితా ఈ నెల 26 వ తేదీన ఉంటుంది. 


రైల్ టెల్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ 18 వ తేదీన ముగిసింది. ధర రూ. 93-94 మధ్య ఉంది. ప్రభుత్వం 27.16 శాతం వాటాను విక్రయిస్తోంది. రైల్ టెల్ రూ. 819 కోట్ల ఐపీవో ఫిబ్రవరి 16-18 మధ్య జరిగింది. ఈ ఆఫర్‌లో ఉన్న షేర్లు 6,11,95,923 కాగా,  ఈ ఆఫర్‌కు 2,59,42,43,370 షేర్లకు బిడ్స్ వచ్చాయి. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల విభాగం నుండి 16 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల నుండి 65 రెట్లు, సంస్థేతర పెట్టుబడిదారుల నుండి 73 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీవో ఇష్యూకు పలు బ్రోకరేజీ సంస్థలు సిఫారసు చేశాయి. రైల్ టెల్ తన ఆదాయంలో 66 శాతం టెలికం విభాగం నుండి పొందుతోంది. మిగిలిన భాగం రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల ద్వారా పొందుతోంది. 

Updated Date - 2021-02-23T22:36:19+05:30 IST