Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేర్వేరు ప్రాంతాల్లో రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

హిందూపురం టౌన, డిసెంబరు 3: హిందూపురం రైల్వేస్టేషన పరిధిలో వేర్వేరు చోట్ల శుక్రవారం ఇద్దరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే ఎస్‌ఐ బాలాజీ నాయక్‌ తెలిపిన మేరకు సిల్క్‌కాలనీకి చెందిన బాబు కుమారుడు మహబూబ్‌బాషా(25) కార్పెంటర్‌ పనిచేస్తూ జీ వించేవాడు. కొద్దిరోజులుగా పనికి వెళ్లకపోవడంతో ఇంట్లో వారు మందలించారు. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం ఉదయం పక్కనే ఉన్న రైల్వేట్రాక్‌పై వెళ్లి రైలు కింద పడ్డాడు. దీంతో శరీరం రెండు ముక్కలైంది. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులకు ఘటనా  స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, మృతదేహా న్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.  మరో ఘటనలో మలుగూరు రైల్వేస్టేషన సమీపం లో శుక్రవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు.  అతడి జేబులో ఉన్న బస్సు టికెట్‌ ఆ ధారంగా గోరంట్ల నుంచి హిందూపురం వచ్చినట్లు గుర్తించా రు. ఎత్తు 5.5అడుగులు, చామనఛాయరంగు, తెలుపు, నీలిరం గు టీషర్ట్‌, పంచె మృతదేహంపై ఉన్నాయన్నారు. మృతుడిని గోరంట్ల మండలం వానవోలుకు చెందిన వ్యక్తి గా అనుమానిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే 9398866299కు సమాచారం అందించాలన్నారు

Advertisement
Advertisement