Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 17 May 2022 21:09:14 IST

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్‪ల Romantic Film రెడీ అవుతోంది

twitter-iconwatsapp-iconfb-icon

రాహుల్ విజయ్ (Rahul Vijay), మేఘ ఆకాష్ (Megha Akash) జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ (Bindu Akash) సమర్పిస్తుండగా.. కోట ఫిలిం ఫ్యాక్టరీ మరియు ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై  ఎ. సుశాంత్ రెడ్డి (A Sushanth Reddy),  అభిషేక్ కోట (Abhishek Kota) నిర్మిస్తున్నారు. అభిమన్యు బద్ది (Abhimanyu Baddi) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‪గా తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్‪తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు షెడ్యూల్స్ షూటింగ్‪తో 90 శాతం చిత్రం పూర్తయిందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. 


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘గోవా (Goa) బ్యాక్‪డ్రాప్‪లో జరిగే రొమాంటిక్ ఎంటర్‪టైనర్ చిత్రమిది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్‪గా ఉంటుంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అభిమన్యు బద్ది డెబ్యూ డైరెక్టరే అయినా.. పక్కా ప్లానింగ్‪తో సినిమాని చిత్రీకరిస్తున్నారు. తాజాగా గోవాలో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. దీంతో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇదే స్పీడ్‪తో సినిమాను కంప్లీట్ చేసి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం..’’ అని అన్నారు. కాగా, ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిషోర్ (Vennela Kishore), అభయ్ బెతిగంటి, వైవా హర్ష, బిగ్ బాస్ సిరి (Bigg Boss Siri) తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement