చిచ్చా...హీరోగా!

ABN , First Publish Date - 2021-03-21T05:58:44+05:30 IST

గాయకుడు, ‘బిగ్‌ బాస్‌ 3’ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘చిచ్చా’ టైటిల్‌ ఖరారు చేశారు. సినిమా టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆవిష్కరించారు

చిచ్చా...హీరోగా!

గాయకుడు, ‘బిగ్‌ బాస్‌ 3’ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘చిచ్చా’ టైటిల్‌ ఖరారు చేశారు. సినిమా టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆవిష్కరించారు. సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. హరీశ్‌ రావుకు ‘చిచ్చా’ చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం ప్రేక్షకుల సమక్షంలో సినిమా టైటిల్‌ సాంగ్‌ విడుదల చేశారు. మల్లిక్‌ కందుకూరి దర్శకత్వంలో ఆర్‌.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంగి సంగీత దర్శకుడు.

Updated Date - 2021-03-21T05:58:44+05:30 IST