సీఎం స్టాలిన్ ఆత్మకథా పుస్తకాన్ని ఆవిష్కరించిన రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-02-28T23:09:57+05:30 IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆత్మకథా పుస్తకాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సోమవారం ఆవిష్కరించారు. చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా..

సీఎం స్టాలిన్ ఆత్మకథా పుస్తకాన్ని ఆవిష్కరించిన రాహుల్ గాంధీ

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆత్మకథా పుస్తకాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సోమవారం ఆవిష్కరించారు. చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. తన పుస్తకానికి స్టాలిన్ ‘ఉంగలిల్ ఒరువన్’ (మీలో ఒకరు) అనే పేరు పెట్టారు. మొదటి పుస్తకాన్ని తమిళనాడు మంత్రి దురైముగురన్‌కు రాహుల్ అందజేశారు.

Updated Date - 2022-02-28T23:09:57+05:30 IST