ఢిల్లీ: ప్రజా సమస్యలపై పోరాడాలని ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ చెప్పారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం రాహుల్‌తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై పోరాడాలన్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారని, పార్టీలో అంతా ఐకమత్యంగా ఉండాలని రాహుల్ చెప్పారని పేర్కొన్నారు. మనమంతా ఒక కుటుంబం అని ఆయన చెప్పారని, పార్టీలో విభేదాల గురించి తాను మాట్లాడలేదని వెల్లడించారు. రాహుల్ గైడ్‌లైన్స్ ప్రకారం ముందుకెళ్తామని జగ్గారెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి