హైదరాబాద్: Shamshabad Airportకు కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi చేరుకున్నారు. ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ నుంచి కాసేపట్లో హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు సంఘర్షణ సభ’కు సర్వం సిద్ధమైంది. రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ జరగనుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా Revanth Reddyని నియమించిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయన రాక నేపథ్యంలో రేవంత్ సహా పార్టీ అగ్రనేతలంతా హనుమకొండకు చేరుకొని సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇవి కూడా చదవండి