Abn logo
Apr 11 2021 @ 18:57PM

బెంగాల్ ప్రచారానికి రాహుల్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంతకంతకూ వేడెక్కుతోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 14 నుంచి పశ్చిమబెంగాల్‌లో ప్రచారం చేపట్టనున్నారు. గోయల్‌పోఖర్, మతిగర-నక్సల్బరి‌లో పలు ర్యాలీల్లో ఆయన పాల్గోనున్నారు. నాలుగు విడతల పోలింగ్ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో రాహుల్ ప్రచారానికి రానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. వామపక్షాలతో కూటమిగా ఉన్న కాంగ్రెస్ 92 స్థానాల్లో పోటీ చేస్తోంది.

కాగా, అసెంబ్లీ ఎన్నికల ఐదో విడత పోలింగ్ 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈనెల 17న జరుగనుంది. ఆరో విడత 43 సీట్లలో ఏప్రిల్ 22న, ఏడో విడత 35 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 26, తక్కిన సీట్లలో చివరి (8వ) విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరుగుతుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెలువడతాయి.

Advertisement
Advertisement