Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 1 2021 @ 15:59PM

వంటగ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడికి పస్తులే: రాహుల్

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ సిలెండర్ ధరను రూ.25 పెంచడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు బలవంతంగా పస్తులతో మాడిపోవాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారని అన్నారు. ప్రజలను ఖాళీ కడుపులతో  నిద్రించేలా చేస్తున్న వ్యక్తి తన మిత్రుల నీడలో సేదదీరుతున్నారంటూ పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ అన్యాయంపై దేశమంతా ఏకతాటిపైకి రావాలన్నారు. గ్యాస్ సిలెండర్ ధర 25 రూపాయలు పెంచడంలో సబ్సిడీ లేని 14.2 కేజీల సిలెండర్ ధర ఢిల్లీలో రూ.884.50కి చేరింది. కమర్షియల్ సిలెండర్ ధర 75 రూపాయలు పెరగడంతో దాని ధర ఢిల్లీలో రూ,1,693కి అయింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధరలు పెంచడంపై ప్రియాంకా గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. పేద ప్రజలకు ఉజ్వల ఎల్‌పీజీ సిలెండర్స్‌ను సబ్సిడీతో ఉవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement