Rahul Gandhi కి Congress అధ్యక్ష పగ్గాలు: DPCC తీర్మానం

ABN , First Publish Date - 2022-06-06T01:05:18+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివారంనాడు ఒక..

Rahul Gandhi కి Congress అధ్యక్ష పగ్గాలు: DPCC తీర్మానం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని అధ్యక్షుడిని చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (DPCC) ఆదివారంనాడు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రస్తుత ప్రభుత్వంతో పోరాడగలిగిన వ్యక్తి ఆయనేనని ఆ తీర్మానం పేర్కొంది. డీపీసీసీ అధ్యక్షుడు అనిల్ చౌదరి దీనిపై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో పోరాటం సాగిస్తున్న రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని, ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆదివారంనాడు ఆమోదించామని చెప్పారు. ఢిల్లీ నవ్ సంకల్ప్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఈ తీర్మానాన్ని డీపీసీసీ ఆమోదించినట్టు తెలిపారు. 

Updated Date - 2022-06-06T01:05:18+05:30 IST