Europe వెళ్లిన Rahul.. కాంగ్రెస్ కీలక సమావేశానికి దూరం..!

ABN , First Publish Date - 2022-07-12T21:18:45+05:30 IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత..

Europe వెళ్లిన Rahul.. కాంగ్రెస్ కీలక సమావేశానికి దూరం..!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత పర్యటన కింద ఆయన యూరప్ వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18న ప్రారంభం కానున్నందున, దీనికి ఒక రోజు ముందు ఆదివారం ఆయన తిరిగి వస్తారని తెలుస్తోంది. ఆసక్తికరంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం ఈనెల 14న జరుగనుంది. రాహుల్ యూరప్ పర్యటన కారణంగా ఈ సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం నేపథ్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ బాధ్యతలను సోనియాగాంధీ నిర్వహిస్తున్నారు.


కాగా, కాంగ్రెస్ ఈనెల 14న జరిపే సమావేశంలో అక్టోబర్ 2 నుంచి ప్రారంభించనున్న యునైట్ ఇండియా క్యాంపెయిన్ ''భారత్ జోడో యాత్ర''కు సంబంధించిన ప్రణాళికలను కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గైర్హాజరవుతుండటం ఆయన నాయకత్వంపై మళ్లీ ప్రశ్నలకు తావీయవచ్చనే ఊహాగానాలు జరుగుతున్నాయి..


రాహుల్ గాంధీ గత మే నెల మొదట్లో నేపాల్‌లోని ఖాట్మండులో ఒక నైట్‌క్లబ్‌లో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. బీజేపీ మద్దతుదారులు ఈ ఫోటోలు విడుదల చేయగా, ఒక జర్నలిస్టు వివాహం కోసం రాహుల్ ప్రైవేటు విజిట్‌ చేశారని, ఇందులో తప్పేముందని కాంగ్రెస్ ప్రశ్నించింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దయనీయమైన ఫలితాలు చవిచూసిన సమయంలో రాహుల్ ఈ పర్యటన చేశారు. మే చివర్లో కూడా రాహుల్ యూకే వెళ్లారు. రాజ్యసభ ఎన్నికల కీలక సందర్భంలోనే ఆయన లండన్ పర్యటన చేపట్టడం మరోసారి చర్చకు తావిచ్చింది

Updated Date - 2022-07-12T21:18:45+05:30 IST