Rahul Gandhi ED News: రాహుల్ గాంధీ-ఈడీ విచారణ.. ఉదయం నుంచి జరిగిన పరిణామాలేంటంటే..

ABN , First Publish Date - 2022-06-13T23:38:30+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు. ఉదయం 3 గంటల పాటు రాహుల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..

Rahul Gandhi ED News: రాహుల్ గాంధీ-ఈడీ విచారణ.. ఉదయం నుంచి జరిగిన పరిణామాలేంటంటే..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు. ఉదయం 3 గంటల పాటు రాహుల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. రాహుల్‌ను మరోసారి విచారిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ స్టేట్‌మెంట్ ఈడీ రికార్డ్ చేసింది. రాహుల్‌కు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లు ఈడీ వర్గాల వెల్లడించాయి. సోమవారం ఉదయం 11:30 నుంచి రాహుల్‌ను ఈడీ విచారించింది. ఉదయం ఈడీ విచారణ అవ్వగానే రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీతో కలిసి గంగారామ్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సోనియాను కలిసేందుకు రాహుల్ అక్కడికి వెళ్లారు. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ ఆదివారం ఆసుపత్రిలో చేరారు.


ఆమెను కలిసిన అనంతరం రాహుల్ గాంధీ మరోమారు ఈడీ ఎదుట హాజరయ్యారు. రాహుల్‌గాంధీపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. అసోసియేట్ జనరల్ సంస్థలో మీ హోదా ఏమిటని ఈడీ ప్రశ్నించింది. యంగ్ ఇండియన్ సంస్థతో మీకున్న సంబంధం ఏమిటి? మీ పేరుతో ఆ సంస్థలో ఎందుకు షేర్లు ఉన్నాయి? యంగ్ ఇండియన్ సంస్థకు కాంగ్రెస్ నుంచి రుణాలు ఎందుకిచ్చారని రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది. ఉదయం నుంచి ఈ వార్త రాసే సమయం వరకూ మినిట్ టూ మినిట్ అప్‌డేట్ ఇదే.



7:46 am: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం వద్ద భారీగా మోహరించిన బలగాలు


7:47 am: కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వద్దకు రాహుల్‌కు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున చేరుకున్న నేతలు, కార్యకర్తలు. అదుపులోకి తీసుకున్న పోలీసులు


8:30 am: ఈడీ కార్యాలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. ఈడీ ఆఫీస్‌కు చేరుకునే అన్ని రోడ్ల దగ్గర బారికేడ్లు, ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారులు కూడా రంగంలోకి..


8:37 am: రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేతల ట్వీట్లు, అదే ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతల కౌంటర్లు


8:39 am: ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు.. రాహుల్‌కు మద్దతుగా నినాదాలు


9:10 am: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరవుతారని కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్ డియో ప్రకటన


9:15 am: రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరవుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రెస్‌మీట్.. కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన తెలుపుతోందని, ఇంతమంది పోలీసులను మోహరించడం చూస్తుంటే కాంగ్రెస్‌కు మోదీ ప్రభుత్వం ఎంత భయపడుతుందో తెలుస్తోందని రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యలు


9:37 am: రాహుల్‌ను ఈడీ నోటీసులు, విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన.. ఢిల్లీలో జరిగిన సత్యాగ్రహ మార్చ్‌లో పాల్గొన్న ప్రియాంక గాంధీ వాద్రా


9:48 am: దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్.. రాహుల్‌పై అన్నీ నిరాధార ఆరోపణలేనని.. సత్యమే గెలుస్తుందని రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్ పోస్ట్


10:22 am: ఈడీ విచారణకు రాహుల్ హాజరయ్యే లోపు ఆయనను కలిసిన ప్రియాంకా గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌కు భారీగా చేరుకున్న కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో రాహుల్, ప్రియాంక భేటీ


10:40 am: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చిన నేతలను, కార్యకర్తలను కలుసుకున్న రాహుల్.. ఆ తర్వాత అక్కడి నుంచి ఈడీ ఆఫీస్‌కు ప్రియాంకతో కలిసి వెళ్లిన రాహుల్ గాంధీ


10:50 am: "Police barricades, ED's jackass, sticks-water cannons cannot stop the storm of truth" అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా


10:58 am: ఈడీ ఆఫీస్‌కు కాంగ్రెస్ కార్యాలయం నుంచి కాలినడకన వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన రాహుల్ గాంధీ


11:12 am: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా. కిలోమీటరు దూరంలోనే కార్యకర్తలను బారికేడ్లతో నిలువరించిన పోలీసులు


11:25 am: ఈడీ కార్యాలయానికి సమీపంలో నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించిన పోలీసులు


11:29 am: PMLA Under Section 50 కింద రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన ఈడీ.. రాహుల్‌ను విచారించిన ముగ్గురు ఈడీ అధికారులు.. అసిస్టెంట్ డైరెక్టర్ ర్యాంకు అధికారి రాహుల్‌ను ప్రశ్నించగా మరో అధికారి రాహుల్ స్టేట్‌మెంట్‌ను టైప్ చేసి రికార్డ్ చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ర్యాంకు అధికారి విచారణను పర్యవేక్షించారు.


12:04 pm: ఈడీ ఆఫీస్ ఎదుట నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు రజ్ని పాటిల్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, ఎల్.హనుమంతయ్య, రణ్‌దీప్ సుర్జేవాలా, అధీర్ రంజన్, కేసీ వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు


12:06 pm: ఈడీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన ప్రియాంకా గాంధీ.. రాహుల్‌తో పాటు ఈడీ కార్యాలయానికి కలిసి వెళ్లిన ప్రియాంకా అక్కడి నుంచి వెళ్లిపోయారు


12:20 pm: రాహుల్ ఈడీ విచారణకు సంబంధించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రెస్‌ కాన్ఫరెన్స్. dotex Merchandise Pvt Ltd కంపెనీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాద్రా సొంత సంస్థ అని.. 2019లో హైకోర్టు కూడా ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై ప్రశ్నించిందన్న స్మృతి


2:11 pm: ఫిర్యాదు ఇచ్చేందుకు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. పోలీసుల చర్యల వల్ల తాను గాయపడినట్లు వెల్లడి. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో బైఠాయించి నిరసన తెలిపిన ప్రియాంక, పోలీసుల తీరుపై మండిపాటు


2:34 pm: ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన రాహుల్ గాంధీ. మూడు గంటల పాటు సాగిన విచారణ


3:01 pm: రాహుల్ విచారణ ముగియలేదని, లంచ్‌కు వెళ్లారని.. లంచ్ అయ్యాక తిరిగి వస్తారని వెల్లడించిన ఈడీ


3:21 pm: ఈడీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా సోనియా చికిత్స పొందుతున్న గంగారామ్ ఆసుపత్రికి వెళ్లిన రాహుల్ గాంధీ.. సోనియాను కలుసుకున్న రాహుల్, ప్రియాంక


3:37 pm: సోనియాతో భేటీ అనంతరం గంగారామ్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన రాహుల్ గాంధీ


3:46 pm: లంచ్ బ్రేక్ తర్వాత మరోమారు ఈడీ ఆఫీస్‌కు వెళ్లి విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

Updated Date - 2022-06-13T23:38:30+05:30 IST