ఐటీ దాడులపై రాహుల్ ఫైర్

ABN , First Publish Date - 2021-03-04T20:24:18+05:30 IST

పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల నివాసాల్లో ఐటీ రైడ్స్ జరగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. రైతు ఉద్యమానికి మద్దతిచ్చే

ఐటీ దాడులపై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ : పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల నివాసాల్లో ఐటీ రైడ్స్ జరగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. రైతు ఉద్యమానికి మద్దతిచ్చేవారిని టార్గెట్ చేస్తూ, ఇలా ఐటీ రైడ్స్‌కు దిగుతున్నారని ఆరోపించారు. హిందీ జాతీయాలను వాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘ఉంగ్లీయోంపై నాచ్‌నా (ఇష్టమున్నట్లు ఆడిస్తున్నారు), ‘భీగీ బిల్లీ బనానా (భయపెట్టించడం), ‘ఖిసియానీ బిల్లీ ఖంబానీచే (అత్తమీద కోపం దుత్తమీద తీయడం) అన్న జాతీయాలను వాడుతూ రాహుల్ చెలరేగిపోయారు. తమకు ఇష్టం వచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖను మోదీ ప్రభుత్వం వాడుకుంటోందని మండిపడ్డారు. మోదీకి కాస్త అనుకూలంగా ఉండే మీడియాలు కేంద్రం ముందు మోకరిల్లిపోయిందని, రైతులకు మద్దతిచ్చే వారిపై కేంద్రం ఐటీ దాడులకు దిగుతోందని ఆరోపించారు.   


పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ బుధవారం సోదాలు నిర్వహించింది. నటి తాప్సీ పన్ను, దర్శక నిర్మాతలు అనురాగ్‌ కశ్యప్‌, వికాస్‌ బెహెల్‌, విక్రమాదిత్య మౌత్వానె, మధు మంతెనలతో పాటు రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో శుభాశిశ్‌ సర్కార్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహించారు. ముంబై, పుణెలోని 30ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. సోదాల తర్వాత తాప్సీ, కశ్య్‌పలను ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. తాప్సి, కశ్యప్‌.. ఢిల్లీలోని రైతు ఉద్యమానికి మద్దతుగా పలు సందర్భాల్లో స్పందించారు. ఈ విషయంపై తాప్సి, కంగనా మధ్య ఇటీవల వాగ్యుద్ధం కూడా జరిగింది. తాప్సీ, కశ్య్‌పలపై ఐటీ దాడులను కాంగ్రెస్‌, ఎన్సీపీలు ఖండించాయి.

Updated Date - 2021-03-04T20:24:18+05:30 IST