ఎల్లుండి చెన్నైకి Rahul

ABN , First Publish Date - 2022-02-26T13:53:24+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నెల 28న చెన్నైకు రానున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రంలో పాల్గొంటారు. అలాగే, ఇటీవల జరిగిన

ఎల్లుండి చెన్నైకి Rahul

                          - ‘పుర’ విజేతలతో సమావేశం


అడయార్‌(చెన్నై): కాంగ్రెస్‌ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నెల 28న చెన్నైకు రానున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రంలో పాల్గొంటారు. అలాగే, ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు ఏఐసీసీ వ్యవరాల ఇన్‌ఛార్జ్‌ రమేష్‌ చెన్నితల వెల్లడించారు. రాహుల్‌ చెన్నై పర్యటన సందర్భంగా స్వాగత ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో చెన్నితల శుక్రవారం చర్చించారు. అంతేకాకుండా ఈ పర్యటన సమయంలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థులతో కూడా రాహుల్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యేలా కార్యక్రమ షెడ్యూల్‌ను తయారుచేస్తున్నారు. మరోవైపు, ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గణనీయమైన సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4వ తేదీన కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీ చైర్మన్ల ఎంపిక కోసం పరోక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సి వ్యూహ ప్రతివ్యూహాలపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో రమేష్‌ రాయపేటలోని సత్యమూర్తి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా వుండగా ఈ అంశంపై ఈ నెల 27వ తేదీన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎన్నికల కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్‌ నేతలతో ఆయనతో పాటు టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్. అళగిరి ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇందులోనే రాహుల్‌ గాంధీ చెన్నై పర్యటనపై చర్చించి, నిర్ణయాలకనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. 

Updated Date - 2022-02-26T13:53:24+05:30 IST