తిరిగి ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-06-13T22:12:56+05:30 IST

నేషనల్ హెరాల్ట్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లంచ్ బ్రేక్ అనంతరం తిరిగి ఈడీ..

తిరిగి ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్ట్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లంచ్ బ్రేక్ అనంతరం తిరిగి ఈడీ విచారణకు హాజరయ్యారు. తొలుత ఈడీ సమన్లకు అనుగుణంగా ఉదయం విచారణకు హాజరైన ఆయనను ఈడీ 3 గంటల సేపు ప్రశ్నించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. అనంతరం లంచ్ బ్రేక్ కావడంతో ఆయన ఈడీ కార్యాలయాన్ని విడిచిపెట్టారు. నేరుగా తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చికిత్స పొందుతున్న గంగారామ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మళ్లీ ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకుని రెండోసారి విచారణకు హాజరయ్యారు.


కాగా, ఉదయం విచారణ సందర్భంగా ఈడీ పలు ప్రశ్నలను రాహుల్‌పై సంధించింది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలో మీ హోదా ఏమిటి? యంగ్ ఇండియన్ సంస్థతో మీ సంబంధం ఏమిటి? మీ  పేరుతో ఆ సంస్థలో షేర్లు ఎందుకు ఉన్నాయి? యంగ్ ఇండియన్ సంస్థకు కాంగ్రెస్ నుంచి రుణాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ప్రస్తుతం రెండోసారి విచారణ కొనసాగుతున్నందున ఈడీ తదుపరి కార్యచరణపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2022-06-13T22:12:56+05:30 IST