Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 10 2021 @ 12:08PM

Jammu and Kashmir: ఖీర్ భవాని దుర్గా ఆలయంలో రాహుల్ పూజలు

 శ్రీనగర్: రెండు రోజుల పర్యటన కోసం జమ్మూకశ్మీరుకు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవాంర గందర్ బల్ జిల్లాలోని ఖీర్ భవానీ ఆలయంలో పూజలు చేశారు.రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా సాయుధ భద్రతా దళాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.రాహుల్ గాంధీ మంగళవారం ఉదయాన్నే సెంట్రల్ కశ్మీరు జిల్లాలోని తుల్లముల్లా ప్రాంతంలోని చినార్ల మధ్య ఉన్న దేవాలయాన్ని  సందర్శించారు.కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కలిసి రాహుల్ గాంధీ ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 

రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవాలయం సందర్శన తర్వాత రాహుల్ గాంధీ దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హజరత్ బల్ దర్గాను కూడా సందర్శించనున్నారు. శ్రీనగర్ లోని ఎంఏ రోడ్డు వద్ద కాంగ్రెస్ భవన్ ను రాహుల్ ప్రారంభిస్తారు. జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మీర్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన రాహుల్ రెండు రోజులు జమ్మూకశ్మీరులో పర్యటించి కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారు.


Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement