చంచల్‌గూడ జైల్లో Rahul Gandhi ములాఖత్‌కు అనుమతి

ABN , First Publish Date - 2022-05-07T17:23:33+05:30 IST

చంచల్‌గూడ జైల్‌లో ములాఖత్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు అనుమతి లభించింది.

చంచల్‌గూడ జైల్లో Rahul Gandhi ములాఖత్‌కు అనుమతి

హైదరాబాద్: చంచల్‌గూడ జైల్‌లో ములాఖత్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కి అనుమతి లభించింది. ములాఖత్‌కు రాహుల్‌, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మాత్రమే జైళ్లశాఖ అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 12:45 గంటల మధ్య ములాఖత్‌కు అనుమతి ఇచ్చారు. చంచల్‌గూడ జైల్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ సహా 17మంది నేతలను రాహుల్‌ పరామర్శించనున్నారు. 25 నిమిషాలపాటు NSUI విద్యార్థులతో కాంగ్రెస్ అగ్రనేత ములాఖాత్ కానున్నారు.


ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ వచ్చేందుకు అనుమతి కోరుతూ జరిగిన వివాదంలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. వీసీ చాంబర్ ముట్టడి నేపథ్యంలో జరిగిన వివాదంపై 8 సెక్షన్‌ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. గత వారం రోజులుగా విద్యార్థులు జైల్లోనే ఉన్నారు. ఈక్రమంలో జరిగిన పరిణామాలపై విద్యార్థులను రాహుల్ అడిగి తెలుసుకోనున్నారు. రాహుల్ గాంధీ చంచల్ గూడ జైల్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

Read more