విరాట్‌ను అనుకరించొద్దు

ABN , First Publish Date - 2020-11-21T10:17:48+05:30 IST

భారత టెస్టు జట్టు సారథిగా అజింక్యా రహానె తన సొంత శైలితోనే ముందుకు సాగాలని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సూచించాడు.

విరాట్‌ను అనుకరించొద్దు

రహానెకు భజ్జీ సలహా


న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు సారథిగా అజింక్యా రహానె తన సొంత శైలితోనే ముందుకు సాగాలని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సూచించాడు. అతడికంటూ వ్యక్తిత్వం ఉందని, దాన్ని కోల్పోకూడదన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు సిరీ్‌సల్లో చివరి మూడు మ్యాచ్‌లకు రహానె కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. దీంతో నాయకత్వం కోసం తన ఆటతీరు, శైలిని మార్చుకోవద్దని భజ్జీ సలహా ఇచ్చాడు. ‘రహానె ప్రశాంతంగా ఉంటాడు. అతడిలో ఎక్కువగా భావోద్వేగాలు కనిపించవు. కోహ్లీతో పోలిస్తే ఇది ఎంతో భిన్నం. టెస్టు కెప్టెన్సీ కచ్చితంగా అతడికి సవాల్‌ లాంటిదే. ఆసీ్‌సలాంటి జట్టును ఎదుర్కోవాలంటే విరాట్‌లాగే దూకుడుగా ఉండాలని రహానె భావిస్తాడేమో. కానీ తన శైలి, వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు’ అని హర్భజన్‌  తేల్చాడు.

Updated Date - 2020-11-21T10:17:48+05:30 IST