శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేదికి ఊరట లభించింది. ఈమెకు తాజాగా సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంతో మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు గతేడాది అరెస్ట్ చేశారు.
ఆ కేసులో రాగిణి బెయిల్ పిటీషన్ కోసం దరఖాస్తు చేసుకోగా కర్ణాటక హై కోర్టు నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తాజాగా రాగిణికి బెయిల్ మంజూరు చేసింది.