ఉగ్ర గోదావరి

ABN , First Publish Date - 2022-08-18T08:31:03+05:30 IST

గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపు దాల్చింది. మహారాష్ట్రలో వర్షాలు, ఉపనదులైన మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి పొంగిపొర్లుతుండడంతో రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది.

ఉగ్ర గోదావరి

మేడిగడ్డకు 10.25 లక్షల క్యూసెక్కులు.. భద్రాద్రి వద్ద 54.4 అడుగుల ఎత్తులో ప్రవాహం

కృష్ణా ప్రాజెక్టులకు నిలకడగా వరద.. శ్రీశైలంలోకి 3.75 లక్షల క్యూసెక్కులు


గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపు దాల్చింది. మహారాష్ట్రలో వర్షాలు, ఉపనదులైన మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి పొంగిపొర్లుతుండడంతో రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. దాదాపు అన్ని ప్రాజెక్టుల నుంచి వచ్చిననీరు వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 10.25 లక్షల క్యూసెక్కులు, తుపాకులగూడెం బ్యారేజీకి 12.52 లక్షల క్యూసెక్కులు,

దుమ్ముగూడెం బ్యారేజీకి 14.93 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 1.04 లక్షల క్యూసెక్కులు, సుందిళ్ల బ్యారేజీకి 61 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 36 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా శ్రీరాంసాగర్‌ నుంచి 19వేలు, ఎల్లంపల్లి నుంచి 36వేల క్యూసెక్కులను వదులుతున్నారు. భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతి స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. బుధవారం సాయంత్రం 54.4 అడుగుల ఎత్తులో ప్రవాహం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు వరద నిలకడగా వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 3.38 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లోకి 2.69లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 3.48లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.91 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అంతేనీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.28 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జూరాల ప్రాజెక్టుకు 2.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నింట్లో జోరుగా జలవిద్యుదుత్పత్తి అవుతోంది. రోజుకు 43 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుదుత్పత్తి చేస్తున్నారు.  

Updated Date - 2022-08-18T08:31:03+05:30 IST