Abn logo
Jul 13 2020 @ 09:58AM

రాజస్థాన్ పీసీసీ చీఫ్‌గా రఘువీర్ మీనా!

జైపూర్: డిప్యూటీ సీఎం, రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్ నిష్క్రమణ దాదాపు ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో... రాజస్థాన్ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రఘువీర్ మీనాను నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ అధ్యక్ష పీఠం కూడా పైలెట్ దగ్గరే ఉండేది. రఘువీర్ మీనా కాంగ్రెస్‌కు అత్యంత నమ్మకస్థుడన్న పేరుంది. సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన... అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీ స్థాయి దాకా వచ్చారు.


2008 లో గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో పార్టీ నిర్మాణంలో మీనాకు అపారమైన అనుభవం ఉంది. అంతేకాకుండా గెహ్లాట్‌తో కూడా ఈయనకు సత్సంబంధాలున్నాయి. సచిన్ పైలెట్‌కు, గెహ్లాట్‌కు మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతోనే వ్యవహారం ఇక్కడి వరకూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా రఘువీర్ మీనాకు ఎంపిక చేసిందని రాజస్థాన్ వర్గాల టాక్. 2005 నుంచి 2011 వరకూ రాజస్థాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శితో పాటు ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 

Advertisement
Advertisement
Advertisement