Abn logo
Jun 24 2021 @ 09:06AM

పోలీస్ కంప్లైంట్స్‌ అథారిటీ చైర్మన్‌ నియామకంపై జగన్‌కు రఘురామ లేఖ

ఢిల్లీ: నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. పోలీస్ కంప్లైంట్స్‌ అథారిటీ చైర్మన్‌ నియామకంపై లేఖలో ప్రస్తావించారు. రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌గా నియమించడంపై రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం 65 ఏళ్ల లోపు ఉన్నవారు పీసీఏ చైర్మన్‌ పదవికి అర్హులని పేర్కొన్నారు. కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌ చేసేందుకే నిబంధన 4(ఏ)ను సవరించారన్నారు. ప్రజల్లో మీ ఇమేజ్ పలుచన కాకూడదనే.. తన లాంటి వ్యక్తులు ఇంత నిష్కర్షగా మీకు అభిప్రాయం చెప్తారని ఆయన వెల్లడించారు. సీఎం తక్షణమే స్పందించి గౌరవప్రదమైన నిర్ణయం తీసుకోవాలని రఘురామ లేఖలో పేర్కొన్నారు.