అవకాశం ఇవ్వాలని రఘురామ విజ్ఞప్తి... సానుకూలంగా స్పందించిన ఎంపీ భూపేంద్ర

ABN , First Publish Date - 2021-06-18T23:52:49+05:30 IST

బీజేపీ ఎంపీ భూపేంద్ర యాదవ్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ఈనెల 25న జరగనున్న పార్లమెంటరీ కమిటీ

అవకాశం ఇవ్వాలని రఘురామ విజ్ఞప్తి... సానుకూలంగా స్పందించిన ఎంపీ భూపేంద్ర

ఢిల్లీ: బీజేపీ ఎంపీ భూపేంద్ర యాదవ్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ఈనెల 25న జరగనున్న పార్లమెంటరీ కమిటీ సమావేశంలో తనపై జరిగిన దాడి అంశాన్ని చర్చించాలని రఘురామ కోరారు. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ జరిగిన దాడిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రఘురామ అభ్యర్థనపై భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారు. పార్లమెంటరీ ప్రజా ఫిర్యాదుల కమిటీలో భూపేంద్ర యాదవ్ చైర్మన్‌గా ఉన్నారు. పార్లమెంటరీ ప్రజా ఫిర్యాదుల కమిటీలో రఘురామకృష్ణరాజు సభ్యుడుగా ఉన్నారు.


ఇటీవల రఘురామకృష్ణరాజు ఎంపీలకు లేఖ రాశారు. తన అరెస్ట్‌ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఆయన లేఖ రాశారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని వాపోయారు. అయితే ఎంపీ రఘురామ లేఖను చూసి పలువురు ఎంపీలు విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది. రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని, జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంపీ సుమలత పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T23:52:49+05:30 IST