Abn logo
Jun 11 2021 @ 10:31AM

సీపీఎస్‌పై సీఎం జగన్‌కు రఘురామ లేఖ

న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్‌పై ఆయన లేఖాస్త్రం సంధించారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన రఘురామ.. నాటి హామీ వీడియోను కూడా జతపర్చారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. అప్పుడు జగన్ హామీలను నమ్మి ఓట్లు వేసిన 4లక్షల మంది ఉద్యోగులు ఇప్పుడు తీవ్ర నిరాసకు లోనయ్యారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం కూడా జరగాలన్నారు.