న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక అరాచకం అంత మాయని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినదానికి, ఖర్చు చేసిన దానికి సంబంధంలేదని ఎంపీ రఘురామ కృష్ణం రాజు విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పినదానికి సంబంధం లేకుండా జరుగుతోందంటే... అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే సందేహం కలుగుతోందన్నారు. ఆర్థిక అరాచకానికి పరాకాష్టని అన్నారు. దీన్ని ఆర్థిక ఉన్మాదం అంటారా? ఆర్థిక తీవ్రవాదం అంటారా? ఆర్థిక అనావృష్టి అంటారా? ఏమంటారని ఆయన ప్రశ్నించారు.
కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులను బడ్జెట్లో చూపెట్టలేదన్నారు. సివిల్ సప్లైస్ బడ్జెట్ రూ. 4,622 కోట్లు.. అయితే ఖర్చు పెట్టింది కేవలం రూ. 104 కోట్లు మాత్రమేనన్నారు. బీసీ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టింది ఏమి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఎంత ఉన్నాయో చూపెట్టలేదని రఘురామ అన్నారు. మరింత సమాచారం కోసం పై వీడియో క్లిక్ చేయండి...
ఇవి కూడా చదవండి