AP: భవిష్యత్‌లో విద్యుత్ కష్టాలు ఎదుర్కొనాల్సి ఉంది: రఘురామ

ABN , First Publish Date - 2021-10-12T20:27:35+05:30 IST

రాష్ట్రంలో భవిష్యత్‌లో విద్యుత్ కష్టాలు ఎదుర్కొనాల్సి ఉందని ఎంపీ రఘరామ కృష్ణంరాజు అన్నారు.

AP: భవిష్యత్‌లో విద్యుత్ కష్టాలు ఎదుర్కొనాల్సి ఉంది: రఘురామ

న్యూఢిల్లీ: రాష్ట్రంలో భవిష్యత్‌లో విద్యుత్ కష్టాలు ఎదుర్కొనాల్సి ఉందని ఎంపీ రఘరామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ సమస్య చాలా తీవ్రమైనదని అన్నారు. దీనిపై సంబంధిత మంత్రి, అధికారులు మాట్లాడాలని.. కానీ సంబంధంలోని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. జగనన్న ట్రూ చార్జ్‌తో ప్రజలకు కష్టాలు వస్తే.. ఇప్పుడు జగనన్న కరెంట్‌ కోత పేరుతో కొత్త పథకం అమలు మొదలైందన్నారు. ఈ కొత్త పథకం శ్రీకాకుళం జిల్లా నుంచే ఆరంభమైందని రఘరామ కృష్ణంరాజు అన్నారు.


విద్యుత్ సంక్షోభంలో భాగంగా మంగళవారం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ కోత విధించనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం నేటి నుంచి అమలు చేయనుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు ప్రకటించారు. ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలకు విద్యుత్ శాఖ అధికారులు మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో గృహ వినియోగదారులకు విద్యుత్ కోతలు విధించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-10-12T20:27:35+05:30 IST