Delhi : ఏపీలో 12 వేల టీచర్ పోస్టులు లేకుండా చేశారని MP Raghurama krishnaraju పేర్కొన్నారు. సాక్షి ప్రకటనలకు రూ.300 కోట్లు ఖర్చు చేశారన్నారు. సీఎం జగన్‌కు సీపీ స్టీఫెన్ రవీంద్ర దోస్తు అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తన ఇంటి ముందు పట్టుకున్న వారిని చూస్తే... ఎవరికైనా అనుమానం వస్తుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉందన్నారు. తనను ట్రాప్ చేసి చంపాలని చూశారని పేర్కొన్నారు. తనకు ఏం జరిగినా సీఎం జగన్‌రెడ్డే కారణమని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.