వారు చెప్తే నేను వింటానా..వెర్రివాడిని కాదు: రఘురామ

ABN , First Publish Date - 2021-08-26T20:43:49+05:30 IST

సాక్షిలో ముందే సీఎం జగన్మోహన్ రెడ్డిపై తాను వేసిన పిటిషన్ రద్దు అని వార్త రాశారని, సోషల్ మీడియా గందరగోళాన్ని..

వారు చెప్తే నేను వింటానా..వెర్రివాడిని కాదు: రఘురామ

న్యూఢిల్లీ: సాక్షిలో ముందే సీఎం జగన్మోహన్ రెడ్డిపై తాను వేసిన పిటిషన్ రద్దు అని వార్త రాశారని, సోషల్ మీడియా గందరగోళాన్ని, సాక్షి క్లిపింగ్ కూడా న్యాయమూర్తికి పంపించడం జరిగిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీర్పు రాకముందే సాక్షిలో ముందుగానే రాశారని, దీని వెనుక ఏముందో విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టును సంప్రదించాలని న్యాయ నిపుణులకు తెలిపానన్నారు. తాను ఎవరో ఆడిస్తే ఆడుతున్నానని మోపిదేవి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ‘18 మంది ఎమ్మెల్యేలు చెప్తే నేను వింటానా?.... నేను వెర్రివాడిని కాదని’ అన్నారు. జగన్ బొమ్మపెట్టుకొని గెలిశానంటున్నారని, తన బొమ్మ పెట్టుకునే గెలిచానన్నారు. మరి జగన్ బొమ్మే పెట్టుకున్న మోపిదేవి ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మోపిదేవి తనపై విమర్శలు చేయడం మంచిది కాదని హితవుపలికారు.


పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా సందర్భంలో ఇబ్బంది పెట్టారని, ఒక అగ్ర నటుడిపై ఉన్న కోపాన్ని ప్రజలపై తీర్చుకుంటే ఎలా? అని రఘురామ ప్రశ్నించారు. థియేటర్ల రేట్లను ప్రభుత్వం ఫిక్స్ చేస్తే ఎలా నడుస్తాయన్నారు. లాభం రాకున్నా సినిమా థియేటర్లను నడుపుతున్నారన్నారు. 150 రూపాయలు మద్యాన్ని 250 చేస్తే కొనుక్కుంటున్నారు.. మరి 150 రూపాయల సినిమా టికెట్ కొనుక్కోలేరా అని అన్నారు. సినీ ప్రముఖులతో సీఎం సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 10 శాతం వాటా ఉందని, దాన్నిఎవరికీ అమ్మాల్సిన అవసరం లేదని రఘురామ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-08-26T20:43:49+05:30 IST