భారత్‌ భవిష్యత్‌కు అత్యంత ప్రమాదకరం ఇదే..

ABN , First Publish Date - 2022-05-15T07:50:02+05:30 IST

భారత భవిష్యత్‌కు ఇదే అత్యంత ప్రమాదకరమని, దాన్ని అడుగడుగునా ప్రతిఘటించాలని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు..

భారత్‌ భవిష్యత్‌కు అత్యంత ప్రమాదకరం ఇదే..

  • మెజారిటీవాదం వల్లే..
  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ 

న్యూఢిల్లీ: మెజారిటీవాదం భారత భవిష్యత్‌కు అత్యంత ప్రమాదకరమని, దాన్ని అడుగడుగునా ప్రతిఘటించాలని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ‘‘దేశంలో మెజారిటీవాద  ట్రెండ్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిణామాలన్నీ ఆర్థిక పురోభివృద్ధికి విరుద్ధమైనవే’’నని ఓ వెబినార్‌లో ప్రసంగిస్తూ ఆయన హెచ్చరించారు. విమర్శలకు చట్టపరమైన అవరోధాలను తొలగించడం ద్వారా ప్రభుత్వాన్ని విమర్శలకు మరింతగా స్పందించేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.


భారత్‌కు సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి అవసరమని, దేశంలోని ఏ వర్గాన్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించినా దాన్ని సాధించలేమన్నారు. మెజారిటీవాదం విభజనకు దారితీస్తుందని, భారతీయులంతా ఏకమవ్వాల్సిన తరుణంలో ఈ వాదం ప్రజలను విడదీస్తుందన్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వృద్ధి పటిష్ఠంగా ఉన్నట్లు కన్పిస్తున్నప్పటికీ, వృద్ధి గణాంకాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉందన్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2020 -21)లో వృద్ధి రేటు మైన్‌సలో నమోదు కావడంతో ‘లో బేస్‌ ఎఫెక్ట్‌’ కారణంగా గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో బలమైన వృద్ధి సాధించినట్లు కన్పిస్తోందన్నారు. 

Updated Date - 2022-05-15T07:50:02+05:30 IST