ఉద్యోగులు పర్మినెంట్.. మనం ఉండేది ఐదేళ్లే..: రఘురామ

ABN , First Publish Date - 2022-02-03T20:31:44+05:30 IST

పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందని...

ఉద్యోగులు పర్మినెంట్.. మనం ఉండేది ఐదేళ్లే..: రఘురామ

న్యూఢిల్లీ: పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందని, ఉద్యోగుల మహాప్రభంజనం కనిపిస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని జగన్‌ అన్నారు.. మరి ఇప్పుడు పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులు పర్మినెంట్ అని, మనం ఉండేది ఐదేళ్లేనన్నారు. శ్రీశ్రీ స్పూర్తితోనే ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారన్నారు. అభినవ రోమ్ చక్రవర్తిలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కొంతమంది అమరావతి రాజధాని కాదని అంటున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చింతామణి నాటక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి క్యారెక్టర్‌ను తీసేద్దామని ఎంపీ రఘురామ సూచించారు.

Updated Date - 2022-02-03T20:31:44+05:30 IST