AP: రాష్ట్రంలో నాటకీయ రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి: రఘురామ

ABN , First Publish Date - 2021-11-25T21:31:51+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటకీయ.. రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని రఘురామ విమర్శించారు.

AP: రాష్ట్రంలో నాటకీయ రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి: రఘురామ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటకీయ.. రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్య మానవులకు కొంత వినోదం అందించేది సినిమా అని.. జగనన్న వినోద దీవెన 30 రూపాయలకు సినిమా చూపిస్తామని గతంలో అన్నారని.. అసెంబ్లీలో ఒక పక్క బిల్లులు రద్దు చేస్తూ.. మరోవైపు చలనచిత్ర పరిశ్రమను కూకటి వేళ్ళతో తీసేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. టిక్కెట్ల రేట్లు పెంచడంపై సోషల్ మీడియాలో ట్రేండింగ్ నడుస్తోందన్నారు. స్థోమత ఉన్నవారు సినిమా చూస్తారని.. దానిపై ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్నారు. థియేటర్లలో సదుపాయాలు ఉన్నాయా లేదో చూడాల్సిన బాధ్యత మాత్రమే ప్రభుత్వంపై ఉంటుందని రాఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీని నాశనం చేయొద్దన్నారు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న కళాకారులకు నష్టం జరుగుతుందన్నారు.


జగనన్న వాహన దీవెన మొదలు పెట్టారని, వాహనాలపై 50 శాతం పన్ను పెంచారని.. పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ వేస్తున్నారని రఘురామ విమర్శించారు. ఏడేళ్లు దాటిన వాహనంపై ఇష్టానుసారంగా పన్నులు వేస్తున్నారని, దేశం అంత ఒకలా ఉంటే.. వైసీపీ ప్రభుత్వం తీరు మరోలా ఉందని ఎద్దేవా చేశారు. పేర్ని నాని అయితే జగనన్నకు సినిమాలు అంటే ఇష్టమని, టికెట్ల రేటు తగ్గించారని కబుర్లు చెప్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష వైఖరితోనే వరద బాధితులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రశ్నించిన ఎంపీ జీవీఎల్‌కు రఘురామ కృష్ణంరాజు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-11-25T21:31:51+05:30 IST