న్యూఢిల్లీ: ఏపీ అసెంబ్లీ తీరు దయ్యాల సభలా ఉందని, నారా భువనేశ్వరికి జరిగిన అవమానం.. భూదేవికి జరిగినట్లేనని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనతో నందమూరి కుటుంబం.. ఎంత ఆవేదన పడిందో చూశామన్నారు.అసెంబ్లీ ఘటన ఎన్టీఆర్ కుటుంబ సమస్య కాదని.. తెలుగుజాతికి జరిగిన అవమానమన్నారు. మీ ఆడవాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ను తెలుగు జాతి సంపద, కుటుంబ పెద్దగా భావించాలన్నారు. దీనిపై మహిళలంతా ఏకమై ముందుకు కదలాలని పిలుపిచ్చారు. రోజులన్నీ ఒకేలా ఉండవని, అది గమనించి వైసీపీ నేతలు నడుచుకోవాలని హితవుపలికారు. వివేకా హత్యపై మాట్లాడకుండా పక్కదారి పట్టించడం సరికాదన్నారు.