కాకమ్మ కథలు చెబుతున్నారు: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2021-10-04T22:57:13+05:30 IST

కాకమ్మ కథలు చెబుతున్నారు: ఎంపీ రఘురామ

కాకమ్మ కథలు చెబుతున్నారు: ఎంపీ రఘురామ

ఢిల్లీ: పిచ్చి పిచ్చి చేష్టలతో విద్యా వ్యవస్థను నాశనం చేయకండని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అన్ని ఏయిడేడ్ స్కూల్స్ కొనసాగుతాయని, అన్యాయం జరగదు అందరికీ మంచే జరుగుతుందన్నారు. జాబ్ క్యాలెండర్స్ లేవంటూ ఉన్న ఉద్యోగాలను పికేస్తున్నారని చెప్పారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు వ్యహరించకండని సూచించారు. ఏపీలో ప్రభుత్వ పనితీరు దారుణంగా మారుతోందని విమర్శించారు. విశాఖ లో ఆస్తుల తాకట్టు పెట్టిన 2900 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని, అది ప్రజల ఆస్తి అన్నారు. మద్యం తాగే వాళ్ళ తలలు తాక్కట్టు పెట్టడమే కాకుండా సిగ్గు లేకుండా ఇప్పుడు ప్రజల ఆస్తులు డబ్బులు తాక్కటు పెడుతున్నారని ఆరోపించారు. కరోనా కారణం చెపుతూ కాకమ్మ కథలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-04T22:57:13+05:30 IST