జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన రఘురామ

ABN , First Publish Date - 2022-01-03T20:17:52+05:30 IST

సీఎం జగన్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన రఘురామ

ఢిల్లీ: సీఎం జగన్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో కూర్చొనే వ్యక్తి ముఖ్యమంత్రి ఏంటండి? అని ప్రశ్నించారు. ఇంట్లోనే ఉండే సీఎం ఏపీలో తప్ప మరెక్కడా ఉండరని తెలిపారు. ఆలయాలకు ధార్మిక సంస్థలు గతంలో ఉండేవని, ఇప్పుడు లేవని చెప్పారు. మాజీమంత్రి వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారని కథనాలు వస్తున్నాయని, తమ సీఎం అందరిలాగే పీఎంను కలిశాక మాట్లాడతానని ప్రకటించారు. జగన్‌, ప్రధానిని కలిశాఖ ప్రత్యేక హోదా, పోలవరంపై ఏం మాట్లాడతారో చూడాలన్నారు. కడప వ్యవహారాలను కూడా ప్రధానితో చర్చిస్తారనుకుంటా అని సందేహం వ్యక్తం చేశారు. ప్రధానితో రాష్ట్ర సమస్యలపై చర్చిస్తే బాగుంటుందని రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. 


’’జగన్‌ బెయిల్ పిటిషన్‌ ఎందుకు ఆలస్యం అవుతుందో దేవుడికే తెలియాలి. కోర్టు అంశంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుంది. విగ్రహాలపై దాడి చేసినవారిని పోలీసులు పట్టుకోవడం లేదు. ఏపీలో ఇళ్లపై ఇష్టానుసారం పన్నులు విధిస్తున్నారు. ఇంట్లో కట్టుకున్న బాత్‌రూం పైనా పన్ను వేస్తున్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని ఎన్టీఆర్ చెప్పారు. జగన్‌ మాత్రం పేదలకు సినిమా టికెట్ ధరలు తగ్గించామంటున్నారు’’ అని రఘురామ విమర్శించారు.

Updated Date - 2022-01-03T20:17:52+05:30 IST