భయం అంటే తెలియని జగన్‌కు విస్తరణ అంటే ఎందుకు భయం?: రఘురామ

ABN , First Publish Date - 2022-03-16T21:05:09+05:30 IST

కేబినెట్ విస్తరణ అని రెండేళ్లు పూర్తయిందని, భయం అంటే తెలియని సీఎం జగన్‌కు విస్తరణ అంటే...

భయం అంటే తెలియని జగన్‌కు విస్తరణ అంటే ఎందుకు భయం?: రఘురామ

న్యూఢిల్లీ: కేబినెట్ విస్తరణ అని రెండేళ్లు పూర్తయిందని, భయం అంటే తెలియని సీఎం జగన్‌కు విస్తరణ అంటే ఎందుకు భయం అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ విస్తరణపై జగన్‌కు స్పష్టత లేదని... విస్తరణ చేసే ధైర్యం కూడా లేదని విమర్శించారు. కేబినెట్ విస్తరించే సాహసం సీఎం చేయరనేది తన భావన అని అన్నారు. 


వాలంటరీ వ్యవస్థపై కాగ్‌కు పిర్యాదు చేశానని.. అవసరమైతే కోర్టుకు వెళ్తానని రఘురామ అన్నారు. సీఎం జగన్ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో నాటు సారా కాస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారని, నాటు సారా మృతులది సహజ మరణం అని ముఖ్యమంత్రి ఎలా అంటారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

Updated Date - 2022-03-16T21:05:09+05:30 IST