న్యూఢిల్లీ: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండించారు. జగన్ సర్కార్ పెంచిన విద్యుత్ చార్జీలపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మూగవానికి కలవస్తే ఎలా చెప్పుకోలేడో.. జగన్ పెడుతున్న కష్టాలను ప్రజలు చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమని రఘురామ అన్నారు. ఒక్కచాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలు అనేక బాధలు పడుతున్నారని రఘురామ అన్నారు.
ఇవి కూడా చదవండి