‘సీత చెప్పిన రామాయణం’ తీసేది ఈయనేనా?

రామాయణ, మహాభారత, భాగవత ఇతిహాసాల్ని తెరపై ఎన్ని కోణాల్లోనైనా ఆవిష్కరించొచ్చు. టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. అలాగే ఆయా గాథల్ని పలువురు దర్శకులు సోషలైజ్ చేసి తీశారు కూడా. ఈ నేపథ్యంలో రామాయణంలోని ఒక కోణాన్ని తనదైన శైలిలో తెరకెక్కించడానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రెడీ అవుతున్నారు. రామాయణంలోని ఒక అద్వితీయ ఘట్టాన్ని సీత కోణంలో ఆవిష్కరించడానికి ఆయన సిద్ధమవుతున్నారని టాక్. దీనికి ‘సీత చెప్పిన రామాయణం’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేశారట. 


ఈ సినిమాకి సంబంధించిన కథ రెడీ అయిందని టాక్. అలాగే దీన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించాలన్నది దర్శకేంద్రుడి సంకల్పం. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు పాత్రలు దీనికి కీలకం కాబట్టి.. ఆ పాత్రల్లో స్టార్ హీరోల్ని ఎంపిక చేయబోతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ వస్తుంది. మరి ఇందులో సీతగా నటించేది ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.  

Advertisement
Advertisement