ఘనంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-14T05:15:05+05:30 IST

: స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో 351వ ఆరాధనోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాలపూలు, తులసిమాలలు, వెండి ఆభరణాలతో అలంకరణ అలంకరించారు.

ఘనంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
అలంకరణలో రాఘవేంద్రస్వామి

ధర్మవరం, ఆగస్టు 13 : స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో 351వ ఆరాధనోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాలపూలు, తులసిమాలలు, వెండి ఆభరణాలతో అలంకరణ అలంకరించారు. ముందుగా  పంచామృతాభిషేకం, కనకమహాపూజ, సాయంత్రం పల్లకీసేవ, స్వస్తివాచన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.  నాట్యకళాకారుడు బాబూబాలాజీ బృందం నృత్యప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం చేపట్టారు. 

Updated Date - 2022-08-14T05:15:05+05:30 IST