టాలీవుడ్ సినిమాలను కమర్షియల్ పేరామీటర్‌లో మరో రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ముందు వరుసలో ఉంటారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ సీనియర్ డైరెక్టర్ ఇప్పుడు మరో అవతారం ఎత్తనున్నారట. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు రాఘవేంద్రరావు నటుడిగా మారుతున్నారు. నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారట. ఇందులో రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో నటిస్తారని, అలాతే రమ్యకృష్ణ, సమంత, శ్రియ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మరి నిజానిజాలేంటో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.