వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారంపై అధికారులు అప్రమత్తం

ABN , First Publish Date - 2022-03-18T21:44:56+05:30 IST

వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రిన్సిపాల్ పద్మావతి నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది.

వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారంపై అధికారులు అప్రమత్తం

గుంటూరు: వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రిన్సిపాల్ పద్మావతి నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. 16న యాంటీ ర్యాగింగ్ కంప్లైంట్ సెల్‌కు ఫిర్యాదు వచ్చిందని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. అబ్బాయిల హాస్టల్‌లో ఘటన జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడామని, సీనియర్ విద్యార్థులకు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చామని, మెస్‌లో కూడా సీనియర్లు, జూనియర్లు కలవకుండా చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

Updated Date - 2022-03-18T21:44:56+05:30 IST