చైనా బలగాలు భారత్‌లోకి ప్రవేశించాయా? లేదా? రాహుల్ ప్రశ్న

ABN , First Publish Date - 2020-06-03T21:06:29+05:30 IST

చైనా బలగాలు భారత్‌లోకి ప్రవేశించాయా? లేదా? అన్న దానిపై కేంద్రం వెంటనే ఓ స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం డిమాండ్ చేశారు.

చైనా బలగాలు భారత్‌లోకి ప్రవేశించాయా? లేదా? రాహుల్ ప్రశ్న

న్యూఢిల్లీ : చైనా బలగాలు భారత్‌లోకి ప్రవేశించాయా? లేదా? అన్న దానిపై కేంద్రం వెంటనే ఓ స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం డిమాండ్ చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మాట్లాడుతూ... గణనీయమైన సంఖ్యలో చైనా దళాలు తూర్పు లడఖ్‌లోకి ప్రవేశించాయని, దీన్ని ఎదుర్కోడానికి తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రకటించారు.


దీన్ని ఆధారంగా చేసుకొని రాహుల్ గాంధీ.... ‘‘చైనా జవాన్లు ఎవరూ భారత్‌లోకి ప్రవేశించలేదని దయచేసి భారత ప్రభుత్వం ధృవీకరించగలదా?’’ అని ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. చైనా విషయంలో సరిహద్దుల్లో ఏం జరుగుతుందో కేంద్రం వెల్లడించాలని, స్పందించకుండా మౌనంగా ఉంటే... పుకార్లకు, అస్థిరతకు మరింత ఆజ్యం పోసినట్లవుతుందని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2020-06-03T21:06:29+05:30 IST