యూఎస్‌ ఓపెన్‌కు నడాల్‌ దూరం

ABN , First Publish Date - 2020-08-06T09:22:18+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌ యూఎస్‌ ఓపెన్‌కు దూరం కానున్నాడు. కరోనా వైరస్‌ ఉధృతి కారణంగా ఈ గ్రాండ్‌స్లామ్‌ నుంచి వైదొలుగుతున్నట్టు...

యూఎస్‌ ఓపెన్‌కు నడాల్‌ దూరం

మాడ్రిడ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌ యూఎస్‌ ఓపెన్‌కు దూరం కానున్నాడు. కరోనా వైరస్‌ ఉధృతి కారణంగా ఈ గ్రాండ్‌స్లామ్‌ నుంచి వైదొలుగుతున్నట్టు స్పెయిన్‌ స్టార్‌ వెల్లడించాడు. ‘కొవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారిని ఇప్పటివరకు నియంత్రించలేకపోయాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా వెళ్లకపోవడమే మంచిదని భావిస్తున్నా’ అని నడాల్‌ ట్వీట్‌ చేశాడు. గాయం కారణంగా రోజర్‌ ఫెడరర్‌, కొవిడ్‌-19 కారణంతో జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌లో ఆడడం లేదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఫెడరర్‌, నడాల్‌ లేకుండా 1999 తర్వాత యూఎస్‌ ఓపెన్‌ జరగనుండడం ఇదే తొలిసారి.

Updated Date - 2020-08-06T09:22:18+05:30 IST