జీజీహెచ్‌లో రేడియోగ్రఫీ కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-06T05:43:25+05:30 IST

జీజీహెచ్‌ (కాకినాడ), డిసెంబరు 5: కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సహకారంతో జీజీహెచ్‌లో ఏర్పా టు చేసిన డిజిటల్‌ రేడియోగ్రఫీ కేంద్రాన్ని

జీజీహెచ్‌లో రేడియోగ్రఫీ కేంద్రం ప్రారంభం
కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జేసీ కీర్తి

జీజీహెచ్‌ (కాకినాడ), డిసెంబరు 5: కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సహకారంతో జీజీహెచ్‌లో ఏర్పా టు చేసిన డిజిటల్‌ రేడియోగ్రఫీ కేంద్రాన్ని శనివారం జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఎక్స్‌రే సేవలను త్వరితగతిన అందించేందుకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు.  కేంద్రం ఏర్పాటుకు కోరమాండల్‌ సంస్థ రూ.17లక్షలను సమకూర్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ గిరిధర్‌, రేడియోలజీ విభాగం ఇన్‌చార్జి డాక్టర్‌ అనూరాధ, కోరమాండల్‌ సంస్థ జీఎం పి.పద్మనాభం, యూనిట్‌ హెడ్‌ ఎస్‌ రవికిరణ్‌, వేణు, వంశీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:43:25+05:30 IST