అత్యాధునిక రేడియేషన్‌ చికిత్సలతో తల, మెడ క్యాన్సర్లకు చెక్‌

ABN , First Publish Date - 2022-04-26T17:39:21+05:30 IST

క్యాన్సర్‌ నివారణకు ఎన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నా, రేడియేషన్‌ టెక్నాలజీ

అత్యాధునిక రేడియేషన్‌ చికిత్సలతో తల, మెడ క్యాన్సర్లకు చెక్‌

ఆంధ్రజ్యోతి(26-04-2022)

క్యాన్సర్‌ నివారణకు ఎన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నా, రేడియేషన్‌ టెక్నాలజీ అద్భుత ఫలితాలనిస్తోంది. క్యాన్సర్‌ సోకిన వారికి అందించే చికిత్సలో రేడియేషన్‌ చికిత్స తప్పనిసరి.


లక్షణాలు ఇవే!

తల, మెడ క్యాన్సర్లలో నాలుక, చెంప, లాలాజలగ్రంథి, టాన్సిల్స్‌, స్వరపేటిక, ఫారింక్స్‌, పారా సైనస్‌ల క్యాన్సర్లు ఉన్నాయి. పొగాకు, ధూమపానం చేసేవాళ్లు, గుట్కా, మద్యపాన ప్రియులు, నోటి శుభ్రత పాటించని వ్యక్తులు, ఎగుడుదిగుడు దంతాలు కలిగినవాళ్లు, హెచ్‌పివి సోకిన వాళ్లకు క్యాన్సర్‌ సోకే అవకాశాలు ఎక్కువ. కేన్సర్‌ సోకిన ప్రదేశం, దశల మీదే లక్షణాలు ఆధారపడి ఉంటాయి. నోట్లో చాలా కాలంగా నయం కాని పూతలు ఉన్నా, నాలుక, చెంపల లోపల తెల్లని మచ్చలు కనిపించినా, దంతాలు వదులైనా క్యాన్సర్‌గా అనుమానించి వైద్యులను సంప్రతించాలి. గొంతు నొప్పి, దవడ నొప్పి, గొంతులో మార్పు, మింగడంలో ఇబ్బంది, ముక్కులో అడ్డుపడినట్టు ఉండడం, ముక్కు నుంచి రక్తస్రావం, బరువు, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలుంటే అప్రమత్తమవ్వాలి. 


చికిత్స ఇలా...

కణితిని తొలగించే శస్త్రచికిత్స, మైక్రోస్కోపిక్‌ మెటాస్టాటిస్‌ పరీక్షించడానికి కీమోథెరపీ, క్యాన్సర్‌ పునరావృతం కాకుండా రేడియేషన్‌ చికిత్సలు అవసరమవుతాయి. క్యాన్సర్‌ తీవ్రతను బట్టి కొందరికి ఈ మూడు చికిత్సలూ అవసరమవుతాయి. 


రేడియేషన్‌ ఎప్పుడంటే...

బుక్కల్‌ మ్యుకోజల్‌ కేన్సర్లు, స్వరపేటిక క్యాన్సర్‌ ప్రారంభ దశలో రేడియేషన్‌ చికిత్స మొదటి పద్ధతి. రేడియేషన్‌ను నివారణ చికిత్సగా, లేదా సర్జరీ తర్వాత లేదా క్యాన్సర్‌ దశ, ప్రదేశాన్ని బట్టి పాలియేటివ్‌ చికిత్సలో భాగంగా కూడా అనుసరించవచ్చు. 90ు కంటే ఎక్కువ క్యాన్సర్లను రేడియేషన్‌తో నయం చేయవచ్చు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంతో పాటు అధునాతన రేడియేషన్‌తో చికిత్స చేయగలిగితే దుష్ప్రభావాలు లేకుండా ఈ వ్యాధిని నయం చేయవచ్చు.


రేడియేషన్‌ తదనంతర జాగ్రత్తలు

చికిత్స సమయంలో నోటి పూత, మందపాటి కఫం, మింగడంలో ఇబ్బందులు, రుచిలో మార్పు, గొంతు బొంగురుపోవడం, చర్మం పిగ్మెంటేషన్‌ లాంటి తాత్కాలిక దుష్ప్రభావాలు కనిపిస్తాయి. రేడియేషన్‌ చికిత్స మొదలుపెట్టిన రెండు వారాల తర్వాత  నుంచి కనిపించే ఈ లక్షణాలు చికిత్స ముగిసిన రెండు నుంచి మూడు వారాల తర్వాత తగ్గిపోతాయి. రేడియేషన్‌ ప్రభావం నుంచి త్వరగా కోలుకోవడం కోసం పోషకాహారం తీసుకోవాలి. నోటి శుభ్రత పాటించాలి.అత్యాధునిక రేడియేషన్‌ చికిత్సలతో  తల, మెడ క్యాన్సర్లకు చెక్‌ కనిష్ఠ దష్ప్రభావాలతో గరిష్ఠ నివారణ


తాజా రేడియేషన్‌ టెక్నాలజీతో తల, మెడ క్యాన్సర్లకు సమర్థమైన చికిత్స అందించవచ్చు. తక్కువ దుష్ప్రభావాలతో నయం చేయవచ్చు. ఐఎఖఖీ, గకఅఖీ,  లేదా ఖఅ్కఐఈ అఖఇ వంటి రేడియేషన్‌ టెక్నాలజీలు, క్యాన్సర్‌ చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. చికిత్స సమయంలో రోగులను ఆన్‌లైన్‌ ఇఆఇఖీతో పరీక్షించడం జరుగుతుంది. ఇఆఇఖీ సహాయంతో అడాప్టివ్‌ ప్లానింగ్‌ ద్వారా మేం సాధారణ కణజాలం రేడియేషన్‌ ప్రభావానికి గురి కాకుండా, క్యాన్సర్‌ను నయం చేసే వీలుంటుంది. మేమందించే అధునాతన రేడియేషన్‌ టెక్నాలజీ చికిత్సలతో రోగులు క్యాన్సర్‌ను జయించి, నాణ్యమైన జీవితాన్ని గడుపుతున్నారు.


డాక్టర్‌ లలితా రెడ్డి. 

కె,కన్సల్టెంట్‌ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌,

రెనోవా సౌమ్య క్యాన్సర్‌ సెంటర్‌,

ఖార్ఖానా, సికింద్రాబాద్‌.

కాంటాక్ట్‌ నంబరు: 779992495

Updated Date - 2022-04-26T17:39:21+05:30 IST