Oct 19 2021 @ 22:08PM

ముందు సర్జరీలు చేయించుకోవడం ఆపేయండి.. ఆ తర్వాత సహజ సౌందర్యం గురించి మాట్లాడండి.. రాధికా ఆప్టే ఘాటు వ్యాఖ్యలు

రాధికా ఆప్టే... తెలుగు వారికి బాలకృష్ణ సరసన నటించిన ముంబై బ్యూటీగా మాత్రమే తెలుసు. వర్మ ‘రక్తచరిత్ర’లోనూ ఆమె మంచి మార్కులు కొట్టేసింది. కానీ, హిందీ ఆడియన్స్‌కి ఆమె సూపర్బ్ యాక్టర్. రాధికా ఏ సినిమాలో ఉన్నా, వెబ్ సిరీస్‌లో కనిపించినా పర్ఫామెన్స్‌తో అదరగొట్టేస్తుంది. నటనకి అవకాశం లేకుంటే ఆమె దాదాపుగా ప్రాజెక్ట్ సైన్ చేయనే చేయదు. 


తెర మీద ఎప్పుడూ డేరింగ్ అండ్ డాషింగ్‌గా తన టాలెంట్ చూపే రాధికా నిజ జీవితంలో కూడా బోల్డ్‌గానే మాట్లాడుతుంది. తాజాగా ఆమె నటీనటుల సర్జరీల గురించి స్పందించింది. ముఖ్యంగా, గ్లామర్ ప్రపంచంలోని అమ్మాయిలు అందంగా కనిపించేందుకు, పిక్చర్ పర్ఫెక్ట్ లుక్ కోసమూ ఆపరేషన్స్ చేయించుకుంటూ ఉంటారు. ఆ సర్జరీలని అందరూ సీక్రెట్‌గానే దాచేస్తుంటారు. అయితే, ఈ మధ్య కొందరు బాలీవుడ్ సెలబ్స్ ‘నో ఫిల్టర్ లుక్’ అంటూ సొషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లాంటి చోట్లలో ఫోటోలు పోస్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఫిల్టర్స్ వాడకుండా న్యాచురల్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్నారు. అదేం పెద్ద విశేషం కాదంటోంది రాధికా ఆప్టే... 


సొషల్ మీడియాలో ఫిల్టర్స్ వాడినా, వాడుకున్నా ముందసలు హీరోయిన్స్ సర్జరీలు మానాలంటోంది ‘లెజెండ్’ లేడీ. సహజ సౌందర్యంతో కాకుండా రకరకాల వైద్యాలు చేయించుకుని ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటం గొప్పేం కాదని చెబుతోంది. ఇకపోతే తాను కూడా అప్పుడప్పుడూ మేకప్ లేకుండానే సొషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంటానని నిజం చెప్పేసింది రాధికా. మరీ తప్పనిసరి అయినప్పుడు మేకప్‌కి బదులుగా ఫిల్టర్స్ కూడా వాడుతుంటానని వివరణ ఇచ్చింది. వెబ్ సిరీస్‌లు, డిఫరెంట్ సినిమాలు చేసుకునే ఈ మరాఠీ బ్యూటీ ఎన్నైనా చెబుతుంది. కానీ, ఈమెలా డేరింగ్‌గా ఉండటం గ్లామర్‌నే నమ్ముకున్న కమర్షియల్ హీరోయిన్స్‌కి సాధ్యమా చెప్పండి? 

Bollywoodమరిన్ని...