Abn logo
Aug 7 2020 @ 16:18PM

విదేశాలకు `రాధేశ్యామ్`?

సాహో` తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఇటలీ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లోనే జరగాల్సి ఉంది. 


యూరప్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఈ చిత్రయూనిట్ జార్జియాలో షూటింగ్‌లో పాల్గొంది. కరోనా కేసులు మరింత పెరుగుతున్న నేపథ్యంలో చిత్రబృందం భారత్‌కు వచ్చేసింది. కరోనా కేసుల తీవ్రత తగ్గిన తర్వాత హైదరాబాద్‌లోనే ప్రత్యేక సెట్స్ వేసి షూటింగ్ జరపాలని చిత్రబృందం భావిస్తోంది. అయినప్పటికీ సినిమాలో మరికొంత భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరించాలట. విదేశీ ప్రయాణాలకు కూడా అనుమతి లభించిన తర్వాత చిత్రబృందం మరోసారి జార్జియా వెళ్లనుందట. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement